11 లేఅవుట్‌లకు విద్యుత్ సౌకర్యం
ABN , Publish Date - Jun 11 , 2026 | 01:07 AM
నగరు శివారు ప్రాంతాల్లో పేదల కోసం సిద్ధం చేసిన పదకొండు లేఅవుట్‌లకు విద్యుత్ సౌకర్యం కల్పించనున్నారు. ఆ లేఅవుట్‌లలో 11,269 ఇళ్ల నిర్మాణం చేపట్టగా 8,036 పూర్తయ్యాయి. మరో 3,233 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడంతో వారంతా మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ సదుపాయం కల్పించాలని ఈపీడీసీఎల్‌ను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో టెండర్లు పిలిచి ఒక సంస్థను ఖరారు చేశారు.
నిరుపేదల ఇళ్లకు, వీధి దీపాలకు...
త్వరలో నీటి సదుపాయం కల్పించేందుకు ప్రతిపాదనలు
విశాఖపట్నం, జూన్ 10 (ఆంధ్రజ్యోతి):
నగరు శివారు ప్రాంతాల్లో పేదల కోసం సిద్ధం చేసిన పదకొండు లేఅవుట్‌లకు విద్యుత్ సౌకర్యం కల్పించనున్నారు. ఆ లేఅవుట్‌లలో 11,269 ఇళ్ల నిర్మాణం చేపట్టగా 8,036 పూర్తయ్యాయి. మరో 3,233 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడంతో వారంతా మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ సదుపాయం కల్పించాలని ఈపీడీసీఎల్‌ను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో టెండర్లు పిలిచి ఒక సంస్థను ఖరారు చేశారు.
ఆనందపురం మండలం మామిడిలోవలో 457 ఇళ్లు, గొట్టిపల్లిలో 271, గిడిజాల-3లో 1,869, జగన్నాథపురం/బాకూరుపాలెంలో 2,571, గాజువాక మండలం జగ్గరాజుపేటలో 69, పద్మనాభం మండలం రెడ్డిపల్లిలో 2,228, అనంతవరంలో 686, గంధవరం-2లో 714, తునివలసలో 996 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించగా, 8,036 పూర్తయ్యాయి. ఆ ఇళ్లకు విద్యుత్ సదుపాయం, కాలనీల్లో వీధి దీపాల కోసం లైన్లు వేసే బాధ్యతను కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. ఇంకా కాలనీలకు నీటి సదుపాయం కల్పించేందుకు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది. అందుకు కొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.