ఎలక్ర్టిక్ బస్సులు వచ్చేశాయ్
ABN , Publish Date - Jul 16 , 2026 | 01:14 AM
ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు బుధవారం నగరానికి చేరుకున్నాయి. తొలివిడత గాజువాక డిపోకు మూడు బస్సులు వచ్చాయి. ప్రస్తుతం గాజువాక డిపోలో విద్యుత్ చార్జింగ్ స్టేషన్ పనులు, సబ్‌స్టేషన్ పనులు పూర్తయ్యాయి. మరికొన్ని చేపట్టాల్సి ఉన్నందున బస్సులను స్టీల్ సిటీ డిపోకు పంపించారు. వీటిని విశాఖ ఆర్‌ఎం బి.అప్పలనాయుడు, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ మల్లేశ్వరరావు, అసిస్టెంట్ ఇంజనీర్ కేఎస్‌డీ ప్రసాద్, తదితరులు పరిశీలించారు.
గాజువాక డిపోకు 3
భోగాపురం విమానాశ్రయానికి ట్రయల్ రన్
ద్వారకా బస్‌స్టేషన్/మల్కాపురం, జూలై 15 (ఆంధ్రజ్యోతి):
ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు బుధవారం నగరానికి చేరుకున్నాయి. తొలివిడత గాజువాక డిపోకు మూడు బస్సులు వచ్చాయి. ప్రస్తుతం గాజువాక డిపోలో విద్యుత్ చార్జింగ్ స్టేషన్ పనులు, సబ్‌స్టేషన్ పనులు పూర్తయ్యాయి. మరికొన్ని చేపట్టాల్సి ఉన్నందున బస్సులను స్టీల్ సిటీ డిపోకు పంపించారు. వీటిని విశాఖ ఆర్‌ఎం బి.అప్పలనాయుడు, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ మల్లేశ్వరరావు, అసిస్టెంట్ ఇంజనీర్ కేఎస్‌డీ ప్రసాద్, తదితరులు పరిశీలించారు. ఈ నెలాఖరుకు మరో 7, ఆగస్టు నెలలో మిగిలిన 10 బస్సులు వస్తాయని ఆర్‌ఎం తెలిపారు. నగరం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి 20 ఎలక్ర్టిక్ బస్సులను నడపనున్నామన్నారు. ఈలోగా గాజువాక నుంచి ఎన్‌ఏడీ, గురుద్వారా, మద్దిలపాలెం, మధురవాడ, ఆనందపురం మీదుగా, గాజువాక నుంచి సింధియా, కాన్వెంట్ జంక్షన్, రైల్వే స్టేషన్, ద్వారకా బస్ స్టేషన్, రుషికొండ ఐటీ పార్కు మీదుగా భోగాపురం విమానాశ్రయం వరకూ ట్రయిల్ రన్‌ను నిర్వహిస్తామని తెలిపారు. ఈ బస్సులను రిజిస్ట్రేషన్ చేయించి, పర్మిట్లు, లైసెన్సులను తీసుకొని విమాన ప్రయాణికుల రవాణాకు సిద్ధం చేస్తామన్నారు. ఈ రెండు మార్గాలలో విమాన ప్రయాణికులు వేచి ఉండేందుకు లాంజ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు.