Share News

పక్కా ప్రణాళికతో ఎన్నికలు

ABN , Publish Date - Oct 21 , 2026 | 11:40 PM

ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పక్కా ప్రణాళికతో ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల పరిశీలకుడు ఆర్‌.కూర్మనాథ్‌ ఆదేశించారు.

పక్కా ప్రణాళికతో ఎన్నికలు
అనంతగిరి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాన్ని సందర్శించి సూచనలు ఇస్తున్న ఎన్నికల పరిశీలకుడు ఆర్‌.కూర్మనాథ్‌

ఎన్నికల పరిశీలకుడు ఆర్‌.కూర్మనాథ్‌

అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన

అనంతగిరి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పక్కా ప్రణాళికతో ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల పరిశీలకుడు ఆర్‌.కూర్మనాథ్‌ ఆదేశించారు. మండల కేంద్రంలోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల వివరాలను ఆయన ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి స్వామినాయుడుని అడిగితెలుసుకున్నారు. అనంతరం బ్యాలెట్‌ బాక్సులు భద్రపరిచే కొత్తవలస బాలుర వసతి గృహాన్ని పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఆయన వెంట సహాయ రిటర్నింగ్‌ అధికారులు ప్రభాకర్‌, ఎం.వీరభద్రచారి, ఎస్‌ఐ కె.శంకరరావు, తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 21 , 2026 | 11:40 PM