Share News

ఎన్నికలను పాదర్శకంగా నిర్వహించాలి

ABN , Publish Date - Oct 31 , 2026 | 11:10 PM

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు రోణంకి కూర్మనాథ్‌ అన్నారు.

ఎన్నికలను పాదర్శకంగా నిర్వహించాలి
ఎన్నికల సిబ్బంది శిక్షణలో మాట్లాడుతున్న జిల్లా పరిశీలకుడు రోణంకి కూర్మనాథ్‌

జిల్లా ఎన్నికల పరిశీలకుడు రోణంకి కూర్మనాథ్‌

పొరపాట్లకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలి

పాడేరు, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు రోణంకి కూర్మనాథ్‌ అన్నారు. స్థానిక ఫంక్షన్‌ హాలులో శనివారం ఎన్నికల సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలపై అవగాహన చేసుకోవాలని, ఎన్నికల నిర్వహణపై అందించిన మాడ్యుల్‌, శిక్షణలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలింగ్‌ కేంద్రానికి వెళ్లడానికి ముందే పోలింగ్‌ నిర్వహణకు సంబంధించిన సామగ్రిని సరిచూసుకోడం, బ్యాలట్‌ పత్రాలు, వాటి సీరియల్‌ నంబర్లు పరిశీలించాలని, బ్యాలట్‌ పేపర్ల విషయంలో అత్యంత గోప్యత పాటించాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి అలక్ష్యం, పొరపాట్లకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పోలింగ్‌ నిర్వహణలో ఏజెంట్లు, ఇతర సిబ్బంది పాత్రపై ప్రిసైడింగ్‌ అధికారులకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. ఎన్నికల సిబ్బందికి ఎటువంటి సందేహాలున్నా అడిగి వాటిని నివృత్తి చేసుకోవాలన్నారు. అనంతరం కౌంటింగ్‌ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో పి.వాసుదేవరావు, మండల రిటర్నింగ్‌ అధికారి భానుమూర్తిరాజు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి తేజ్‌రతన్‌, తదతరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2026 | 11:10 PM