Share News

ఎంపీపీ పదవులకు 19న ఎన్నికలు

ABN , Publish Date - Nov 11 , 2026 | 12:59 AM

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌, మండల ప్రజా పరిషత్‌ అధ్యక్ష (ఎంపీపీ) పదవులకు పరోక్ష ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో బీసీ మహిళలకు కేటాయించిన జడ్పీ చైర్‌పర్సన్‌ పదవితోపాటు, 24 ఎంపీపీ పదవులకు, కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక జరుగుతుంది. ఎంపీపీ, వైస్‌ఎంపీపీ పదవులకు ఈ నెల 19న, జడ్పీ చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌ పదవులకు 20వ తేదీన సంబంధిత అధికారులు ఎన్నికలు నిర్వహిస్తారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జడ్పీ చైర్‌పర్సన్‌, ఎంపీపీ పదవులకు పరోక్ష ఎన్నికలు నిర్వహించడానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు ఆయా జడ్పీ/ మండల పరిషత్‌ అఽధికారులు ఈ నెల 14వ తేదీలోగా జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు వ్యక్తిగతంగా సమాచారం పంపాల్సి వుంటుంది. ప్రతి మండల ప్రజా పరిషత్‌లో ఒకరిని, జిల్లా పరిషత్‌కు ఇద్దరిని కోఆప్షన్‌ సభ్యులుగా ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియను జడ్పీ చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌, ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలను ఎన్నుకోక ముందే నిర్వహిస్తారు. వీరిని ఆయా జడ్పీటీసీ/ ఎంపీటీసీ సభ్యులు ఎన్నుకోవాల్సి వుంటుంది. కోఆప్షన్‌ సభ్యులు కచ్చితంగా మైనారిటీ వర్గాలకు చెందిన వారై వుండాలి. ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలకు 19వ తేదీ ఉదయం పది గంటల లోపు నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలలోగా వీటిని ఎన్నికల అధికారులు పరిశీలించి, పోటీలో వున్న అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు మధ్యాహ్నం ఒంటిగంట వరకు సమయం వుంటుంది. ఒక్కో పదవికి ఒక్కో నామినేషన్‌ మాత్రమే దాఖలైతే ఆయా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. ఒకవేళ ఇద్దరికన్నా ఎక్కువ మంది పోటీ పడుతుంటే సమావేశం ఏర్పాటు చేసి, సభ్యులు చేతులు ఎత్తడం ద్వారా ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలను ఎన్నుకుంటారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు మండల ప్రజా పరిషత్‌ తొలి సమావేశం నిర్వహిస్తారు. ఎక్స్‌ అఫీషియో సభ్యులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఈ సమావేశాలకు హాజరు కావచ్చు. అయితే వీరికి ఓటు హక్కు వుండదు. ఈ నెల 20వ తేదీన జడ్పీ కోఆప్షన్‌ సభ్యులు, అనంతరం చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు కూడా ఇదే తరహాలో ఎన్నిక జరుగుతుంది.

Updated Date - Nov 11 , 2026 | 12:59 AM