ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలి
ABN , Publish Date - Oct 31 , 2026 | 11:12 PM
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నిబంధనలను ప్రతీ రాజకీయ పార్టీ కచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి అన్నారు.
రాజకీయ పార్టీ ప్రతినిధులకు కలెక్టర్ నిషాంతి స్పష్టీకరణ
ప్రవర్తనా నియమావళిపై అవగాహన కలిగి ఉండాలి
సజావుగా ఎన్నికలకు సహకరించాలి
పాడేరు, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నిబంధనలను ప్రతీ రాజకీయ పార్టీ కచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. కలెక్టరేట్‌లో స్థానిక ఎన్నికలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థులు, ప్రతినిధులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. అభ్యర్థులు, ఏజెంట్లు, కార్యకర్తలు ఎన్నికల నిబంధనలను విధిగా అనుసరించాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిర్దేశిత తేదీలు, వివిధ దశల్లో చేపట్టే ప్రక్రియలు, ఏర్పాట్లు, తదితర అంశాలను కలెక్టర్ నిషాంతి వివరించారు. రాజకీయ పార్టీల ఏజెంట్లు పాటించాల్సిన నిబంధనలను విశదీకరించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, నిబంధనలకు అనుగుణంగా జరిగేలా ఎన్నికల కచ్చితంగా కోడ్‌ను పాటించాలని సూచించారు. అందుకు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు సంపూర్ణంగా సహకరించాలన్నారు. ఎస్‌పీ అమిత్‌బర్దార్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామని, అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికలు సజావుగా జరిగేందుకు సంపూర్ణంగా సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల పరిశీలకుడు రోణంకి కూర్మనాథ్, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, సబ్‌కలెక్టర్ కె.సాహిత్, అడిషనల్ ఎస్‌పీ వై.శృతి, జడ్పీ సీఈవో పి.వాసుదేవరావు, జిల్లా పంచాయతీ అధికారి కేపీ.చంద్రశేఖర్, డీఎల్‌పీవో పీఎస్.కుమార్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.