Share News

మాడగడలో ఎన్నికల కమిషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పర్యటన

ABN , Publish Date - Jul 06 , 2026 | 01:09 AM

మండలంలోని మాడగడ పంచాయతీ కేంద్రంలో ఆదివారం ఎన్నికల కమిషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌బీ జోషి పర్యటించారు. స్థానిక అధికారులతో కలిసి మాడగడ పంచాయతీ పరిధిలోని పోలింగ్‌ కేంద్రం నంబర్‌ 244ను సందర్శించి, ప్రస్తుతం కొనసాగుతున్న సర్‌ ప్రక్రియను పరిశీలించారు. ఇంటింటా సర్వే, ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ, ఫారాల డిజిటలైజేషన్‌, ఓటర్‌ నమోదు ప్రక్రియ, బీఎల్‌వోల పనితీరు, తదితర అంశాలను పరిశీలించి సర్‌ ప్రక్రియ సమర్థంగా జరగడానికి అవసరమైన పలు సూచనలు చేశారు.

మాడగడలో ఎన్నికల కమిషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పర్యటన
మాడగడలో సర్‌ ప్రక్రియను పరిశీలిస్తున్న ఎన్నికల కమిషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌బీ జోషి

- సర్‌ ప్రక్రియను పరిశీలించిన ఎస్‌బీ జోషి

అరకులోయ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మాడగడ పంచాయతీ కేంద్రంలో ఆదివారం ఎన్నికల కమిషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌బీ జోషి పర్యటించారు. స్థానిక అధికారులతో కలిసి మాడగడ పంచాయతీ పరిధిలోని పోలింగ్‌ కేంద్రం నంబర్‌ 244ను సందర్శించి, ప్రస్తుతం కొనసాగుతున్న సర్‌ ప్రక్రియను పరిశీలించారు. ఇంటింటా సర్వే, ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ, ఫారాల డిజిటలైజేషన్‌, ఓటర్‌ నమోదు ప్రక్రియ, బీఎల్‌వోల పనితీరు, తదితర అంశాలను పరిశీలించి సర్‌ ప్రక్రియ సమర్థంగా జరగడానికి అవసరమైన పలు సూచనలు చేశారు. అలాగే క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను స్వయంగా పరిశీలించి, అధికారులు, సిబ్బందితో మాట్లాడి అవసరమైన మార్గదర్శకాలను అందించారు. ఆయన వెంట తహశీల్దార్‌ రాజా శ్రీధర్‌, ఎంపీడీవో వీసం ప్రసాద్‌, ఎంఆర్‌ఐ పట్టాసీ శంకరరావు, సూపర్‌వైజర్‌ రవికుమార్‌, బీఎల్‌వో బీబీ ప్రసాదరావు, తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 06 , 2026 | 01:09 AM