ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి
ABN , Publish Date - May 23 , 2026 | 11:34 PM
స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఇన్‌గేటు వద్ద శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు ఢీకొని ఒక వృద్ధురాలు మృతి చెందిందని ట్రాఫిక్ ఎస్‌ఐ డి.శేఖరం తెలిపారు. దీనికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
అనకాపల్లి టౌన్, మే 23 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఇన్‌గేటు వద్ద శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు ఢీకొని ఒక వృద్ధురాలు మృతి చెందిందని ట్రాఫిక్ ఎస్‌ఐ డి.శేఖరం తెలిపారు. దీనికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. చోడవరం మండలం శ్రీరామపట్నం గ్రామానికి చెందిన ఉద్దగిరి మాణిక్యం(65) శనివారం ఉదయం అచ్యుతాపురం మండలం కాశీపాలెంలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు బస్సులో అనకాపల్లికి వచ్చింది. అనకాపల్లిలో బస్సు దిగిన తరువాత కాశీపాలెం వెళ్లేందుకు ఆర్టీసీ ఇన్‌గేటు ముందు నడిచి వెళుతుండగా అదే సమయంలో పాయకరావుపేట నుంచి అనకాపల్లి కాంప్లెక్స్‌కు వస్తున్న అనకాపల్లి డిపో బస్సు ఆమెను ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎన్టీఆర్ వైద్యాలయంలోని మార్చ్యురీ గదికి తరలించారు. మృతురాలి కుమారుడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ శేఖరం తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్ రమణను అదుపులోకి తీసుకున్నామన్నారు.