పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు
ABN , Publish Date - Nov 11 , 2026 | 01:05 AM
జిల్లాలో త్వరలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీల ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 26, 29, డిసెంబరు 2 తేదీల్లో జిల్లాలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె మంగళవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో వెబెక్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణపై పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని అన్నారు.
జిల్లాలో 26, 29, డిసెంబరు 2 తేదీల్లో మూడు విడతలుగా పోలింగ్
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
బీఎల్‌ఓల ద్వారా ఇంటింటికీ ఓటరు స్లిప్పులు పంపిణీ
కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశం
అనకాపల్లి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో త్వరలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీల ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 26, 29, డిసెంబరు 2 తేదీల్లో జిల్లాలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె మంగళవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో వెబెక్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణపై పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఎక్కడా ఉల్లంఘనలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా బీఎల్‌ఓల ద్వారా ప్రతి ఇంటికీ ఓటరు స్లిప్పులను పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాలను ముందుగానే సందర్శించి, వాటిల్లో తాగునీరు, విదుత్తు, ఇతర సదుపాయాలు ఉండేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, పోలింగ్ కేంద్రాలకు తరలింపు, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి అవసరమైన బందోబస్తుకు చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ జరిగే రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీపీఓ కిరణ్, అనకాపల్లి, నర్సీపట్నం, అడ్డరోడ్డు జంక్షన్ ఆర్డీఓలు, డిప్యూటీ సీఈఓ, పోలీస్ అధికారులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.