ఏకలవ్య గురుకుల పాఠశాల జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్
ABN , Publish Date - Aug 14 , 2026 | 11:17 PM
చింతపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏఎన్‌ఎంని కొట్టిన జూనియర్ అసిస్టెంట్‌ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ప్రిన్సిపాల్ మనోజ్‌కుమార్ తెలిపారు.
చింతపల్లి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): చింతపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏఎన్‌ఎంని కొట్టిన జూనియర్ అసిస్టెంట్‌ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ప్రిన్సిపాల్ మనోజ్‌కుమార్ తెలిపారు. గురువారం ఏఎన్‌ఎం సుజాత, అటెండర్ కోటి, మరికొంతమంది నాలుగో తరగతి ఉద్యోగులు జీతాల బిల్లులు పెట్టాలని జూనియర్ అసిస్టెంట్ సుమిత్‌ని కోరారు. అతడు ఏఎన్‌ఎం చెంపపై కొట్టాడని బాధితురాలు ప్రిన్సిపాల్, చింతపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై ప్రిన్సిపాల్ ప్రాథమిక విచారణ నివేదికను గురుకులం, నెస్ట్ అధికారులకు పంపించారు. ప్రాథమిక నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు జూనియర్ అసిస్టెంట్ సుమిత్‌ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను పాఠశాలకు మెయిల్ చేశారని ప్రిన్సిపాల్ విలేకరులకు తెలిపారు. కాగా ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.