టీడీపీ బలోపేతానికి కృషి
ABN , Publish Date - May 13 , 2026 | 01:15 AM
టీడీపీ బలోపేతానికి కృషి
- జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి
పాడేరు, మే 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. స్థానిక కాఫీ హౌస్‌లో టీడీపీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. క్షేత్రస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలన్నారు. క్లస్టర్, బూత్ ఇన్‌చార్జులు గ్రామ స్థాయిలో నిత్యం ప్రజలతో మమేకం కావాలన్నారు. గ్రామాల్లోని సమస్యలను పార్టీ పెద్దలు లేదా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటేలా నేతలు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. అధిక సంఖ్యలో పంచాయతీలను కైవసం చేసుకునేలా ఇప్పటి నుంచే నేతలు ప్రణాళికాబద్ధంగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరావు, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, టూరిజం డైరెక్టర్ కేవీ రమేశ్‌నాయుడు, టీడీపీ సీనియర్ నేతలు సోమెలి చిట్టిబాబు, రేగం కొండబాబు, నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన పార్టీ నేతలు, క్లస్టర్, బూత్ ఇన్‌చార్జులు పాల్గొన్నారు.