బీజేపీ బలోపేతానికి కృషి
ABN , Publish Date - May 15 , 2026 | 11:51 PM
ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో పని చేసి బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు.
క్రమశిక్షణతో పని చేయాలి
పార్టీ శ్రేణులకు రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పిలుపు
సబ్బవరం, మే 15 (ఆంధ్రజ్యోతి): ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో పని చేసి బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. మండలంలోని ఇరువాడలో గల జీఎస్ కన్వెన్షన్‌లో శుక్రవారం జిల్లా స్థాయి పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్-2026 శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ క్రమశిక్షణ, సిద్ధాంతపరమైన పార్టీ అన్నారు. కార్యకర్తలు వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ, దేశ ప్రయోజనాల కోసమే పని చేయాలన్నారు. పార్టీ ఇచ్చిన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తించాలన్నారు. ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాల కోసం పని చేయాలన్నారు. పార్టీ సీనియర్ నాయకుడు చొక్కాకుల వెంకటరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, నేతలు శరగడం శంకరరావు, రెడ్డి రామునాయుడు, వనం సత్యనారాయణ, గొంప నర్సింగరావు, సామ్రాట్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.