Share News

జిల్లాను మత్తు రహితం చేసేందుకు కృషి

ABN , Publish Date - Apr 27 , 2026 | 11:42 PM

జిల్లాను మత్తు రహితం చేసేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ టి.నిషాంతి సూచించారు. కలెక్టరేట్‌లో నవోదయం 2.0పై వివిధ శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన సమావే శంలో ఆమె మాట్లాడారు.

జిల్లాను మత్తు రహితం చేసేందుకు కృషి
అధికారులతో సమావేశమైన కలెక్టర్‌ టి.నిషాంతి

అధికారులకు కలెక్టర్‌ టి.నిషాంతి సూచన

పాడేరు, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): జిల్లాను మత్తు రహితం చేసేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ టి.నిషాంతి సూచించారు. కలెక్టరేట్‌లో నవోదయం 2.0పై వివిధ శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన సమావే శంలో ఆమె మాట్లాడారు. మాదక ద్రవ్యాల వినియోగంతో యువత జీవితాలు నాశమవుతాయని, దాని వల్ల కలిగే నష్టాలపై వారికి అవగాహన ఏర్పరచి, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. యువతకు స్వయం ఉపాధి పథకాలు, జాబ్‌మేళాలు నిర్వహించాలని, అందుకు బ్యాంకులు సహకరించాలన్నారు. జిల్లాలో మరిన్ని బ్యాంకులు ఏర్పాటు చేయాలని, అధిక సంఖ్యలో రుణాలు అందించాలని సూచించారు. గతంలో రుణాలు తీసుకున్నవారు తిరిగి చెల్లించాలని, మొండి బకాయిల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. వివిధ సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందు సాగాలన్నారు. జిల్లాలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని తెలిపారు. వాహన చోదకులు రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ నియమాలు పాటించాలని, జిల్లా రోడ్డు భద్రతా కమిటీ ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎక్సైజ్‌ అధికారి ఆర్‌.గౌరీశ్వరరావు, జిల్లా సహకార అధికారి ఎంవీ రామకృష్ణారావు, జిల్లా రిజిస్ట్రార్‌ సీహెచ్‌ నరసింహమూర్తి, జిల్లా ప్రజా రవాణాధికారి శ్రీనివాసరావు, జిల్లా ఖజానాధికారి అనిల్‌కుమార్‌, డీసీసీబీ మేనేజర్‌ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2026 | 11:42 PM