Share News

ప్రజల చెంతకు పాలన చేరేలా కృషి

ABN , Publish Date - May 08 , 2026 | 12:31 AM

జిల్లాలో పరిపాలనను ప్రజల చెంతకు చేరేలా కృషి చేయాలని అధికారులను జేసీ శ్రీపూజ ఆదేశించారు.

ప్రజల చెంతకు పాలన చేరేలా కృషి
మాట్లాడుతున్న జేసీ శ్రీపూజ

అధికారులకు జేసీ శ్రీపూజ ఆదేశం

పాడేరురూరల్‌, మే 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పరిపాలనను ప్రజల చెంతకు చేరేలా కృషి చేయాలని అధికారులను జేసీ శ్రీపూజ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఒక గ్రామం- ఒక నెల కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. అమరావతిలో కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేసిన అంశాలను క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలు చేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2026 | 12:31 AM