Share News

ఎడ్‌సెట్‌ ఫలితాల్లో సత్తాచాటారు

ABN , Publish Date - May 27 , 2026 | 12:41 AM

బీఈడీ, స్పెషల్‌ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి.

ఎడ్‌సెట్‌ ఫలితాల్లో సత్తాచాటారు

పలు సబ్జెక్టుల్లో ర్యాంకులు సాధించిన జిల్లా విద్యార్థులు

గణితంలో 1, 4, 6, ఇంగ్లీష్‌, ఫిజికల్‌ సైన్స్‌లలో 6 ర్యాంకులు...

విశాఖపట్నం, మే 26 (ఆంధ్రజ్యోతి):

బీఈడీ, స్పెషల్‌ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. జిల్లాకు చెందిన పలువురు రాష్ట్రస్థాయిలో మంచి ర్యాంకులు సాధించారు. నగర పరిధిలోని కూర్మన్నపాలెం ప్రాంతానికి చెందిన కర్ణం మౌనిక 121 మార్కులతో మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులో మొదటి ర్యాంకు సాధించింది. ఇదే సబ్జెక్టులో పద్మనాభం మండలం పాండ్రంకి గ్రామానికి చెందిన పట్టిగిళ్ల మనోజ్‌ శివకుమార్‌ 112 మార్కులతో నాలుగో ర్యాంకు, పోతినమల్లయ్యపాలెం ప్రాంతానికి చెందిన బడిగంటి జగదీష్‌ 108 మార్కులతో ఆరో ర్యాంకు సాధించారు. పోతినమల్లయ్యపాలెం ప్రాంతానికి చెందిన తాటిపర్తి బాలాజీ 113 మార్కులతో ఫిజికల్‌ సైన్స్‌లో రెండో ర్యాంకు సాధించాడు అలాగే, ఇంగ్లీష్‌ సబ్జెక్టులో చినవాల్తేరు ప్రాంతానికి చెందిన సంధ్యా గురుంగ్‌ 117 మార్కులతో ఆరో ర్యాంకు, బయలాజికల్‌ సైన్స్‌లో కంచరపాలెం ప్రాంతానికి కర్రపాటి జగదీష్‌కుమార్‌ 114 మార్కులతో ఎనిమిదో ర్యాంకు సాధించారు. అధికారిక వెబ్‌సైట్‌లో సంబంధించిన ర్యాంకు కార్డులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

Updated Date - May 27 , 2026 | 12:41 AM