అరకు సంతలో దసరా సందడి
ABN , Publish Date - Oct 16 , 2026 | 11:23 PM
ఏజెన్సీలోనే అతిపెద్ద అరకు వారపు సంత శుక్రవారం కొనుగోలుదారులతో కిటకిటలాడింది.
భారీగా ధర పలికిన నాటుకోళ్లు, మేకలు, గొర్రెపొట్టేళ్లు
నాటుకోళ్లు రూ.1200 నుంచి రూ.2 వేలు వరకు..
మేకలు, గొర్రెపొట్టేలు రూ. 8 వేలు నుంచి
డుంబ్రిగుడ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి):
ఏజెన్సీలోనే అతిపెద్ద అరకు వారపు సంత శుక్రవారం కొనుగోలుదారులతో కిటకిటలాడింది. దసరా పండుగ కావడంతో గిరిజనులు కుటుంబ సమేతంగా తరలివచ్చి అవసరమైన సరుకులు కొనుగోలు చేశారు. దసరాకు నాటు కోళ్లు, మేకలు, గొర్రెపొట్టేలకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో నాటుకోల్లు రూ.1200 నుంచి రూ.రెండు వేలు వరకు, మేకలు, గొర్రెపొట్టేలు 8 వేల నుంచి 15 వేల వరకు ధర పలికింది. ఈ సందర్భంగా బేరసారాలు జోరుగా సాగాయి. సంతలో బట్టల దుకాణాల్లో చిన్నారులకు కొత్త బట్టలు కొనుగోలు చేయడానికి తల్లిదండ్రులు ఎగబడ్డారు. మహిళలు పండుగకు సంబంధించిన పూజ సామగ్రి, కొబ్బరికాయలు, గాజులు, పసుపు, కుంకుమ కొనుగోలు చేశారు. దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి.