Share News

గరిష్ఠస్థాయికి డుడుమ నీటిమట్టం

ABN , Publish Date - Jul 06 , 2026 | 01:06 AM

ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రానికి నీరందించే డుడుమ జలాశయంలో నీటి నిల్వలు గరిష్ఠస్థాయికి చేరుకున్నాయి. గత కొద్ది రోజులుగా వర్షాలు కురవడంతో వరద నీరు ఇన్‌ఫ్లో పెరిగింది. దీంతో జలాశయంలో నీటి నిల్వలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

గరిష్ఠస్థాయికి డుడుమ నీటిమట్టం
డుడుమ నుంచి బలిమెలకు నీటిని విడుదల చేస్తున్న దృశ్యం

బలిమెలకు 2,500 క్యూసెక్కుల నీరు విడుదల

ముంచంగిపుట్టు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రానికి నీరందించే డుడుమ జలాశయంలో నీటి నిల్వలు గరిష్ఠస్థాయికి చేరుకున్నాయి. గత కొద్ది రోజులుగా వర్షాలు కురవడంతో వరద నీరు ఇన్‌ఫ్లో పెరిగింది. దీంతో జలాశయంలో నీటి నిల్వలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ జలాశయంలో 2,590 అడుగుల నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం ఉండగా, ఆదివారం 2,588.6 అడుగుల నీటిమట్టం నమోదైందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా జలాశయంలోకి వరద నీరు ఎక్కువగా రావడంతో పాటు నీటి నిల్వలు గరిష్ఠస్థాయికి చేరుతున్నట్టు అధికారులు గుర్తించారు. 7వ నంబరు గేటును మూడు అడుగులు ఎత్తి 2,500 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతంలో గల బలిమెలకు విడుదల చేస్తున్నారు. అలాగే డుడుమ జలాశయానికి ఎగువన ఉన్న జోలాపుట్టు జలాశయంలో 2,750 అడుగుల నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం ఉండగా, ప్రస్తుతం 2,710 అడుగుల నీటిమట్టం నమోదైందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. వర్షం ఇలాగే కొనసాగితే రాత్రికి మరిన్ని క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేసే అవకాశం ఉంది.

Updated Date - Jul 06 , 2026 | 01:06 AM