డీఎస్‌సీ-2026 నోటిఫికేషన్?
ABN , Publish Date - Oct 14 , 2026 | 12:47 AM
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి డీఎస్‌సీ-2026 నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటనకు ముందే దీనిని విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,721 పోస్టులను భర్తీ చేయనున్నది. అనకాపల్లి జిల్లాకు సంబంధించి మొత్తం 32 పోస్టులు భర్తీ చేస్తారు.
జిల్లాలో 32 పోస్టులు
ప్రభుత్వ, జిల్లా/ మండల పరిషత్ పాఠశాలల్లో 20, స్పెషల్ ఎడ్యుకేషన్‌లో 12...
అనకాపల్లి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి డీఎస్‌సీ-2026 నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటనకు ముందే దీనిని విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,721 పోస్టులను భర్తీ చేయనున్నది. అనకాపల్లి జిల్లాకు సంబంధించి మొత్తం 32 పోస్టులు భర్తీ చేస్తారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 19 ఖాళీగా ఉన్నాయి. అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టు ఒకటి వుంది. ఇవికాకుండా స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 5, సెకండరీ గ్రేడ్ అసిస్టెంట్ పోస్టులు 7 ఖాళీ ఉన్నాయి. మొత్తం 32 పోస్టులు భర్తీచేస్తారు. ఇవి కాకుండా ఇంకా సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాలు/ ఆశ్రమాలు, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లల్లో మరికొన్ని ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేస్తారు. రిజర్వేషన్ల వివరాలు నోటిఫికేషన్‌లో వస్తాయి. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. పూర్తి వివరాలు బుధవారం వెల్లడయ్యే అవకాశం ఉంది.