Share News

ఎండా.. వాన..

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:01 PM

వాతావరణంలోని మార్పుల కారణంగా మన్యంలో శనివారం ముసురు వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాసింది. ఆ తర్వాత ఉరుములు, పిడుగులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది.

ఎండా.. వాన..
: పాడేరులో శనివారం మఽధ్యాహ్నం ఎండకు గొడుగు వేసుకున్న మహిళ

ఏజెన్సీలో విభిన్న వాతావరణం

మధ్యాహ్నం వరకు ఎండ.. తర్వాత వర్షం

తగ్గని గరిష్ఠ ఉష్ణోగ్రతలు

అనంతగిరిలో 38.6 డిగ్రీలు

పాడేరు, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): వాతావరణంలోని మార్పుల కారణంగా మన్యంలో శనివారం ముసురు వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాసింది. ఆ తర్వాత ఉరుములు, పిడుగులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. తెల్లవారుజామున ఒక మోస్తరుగా పొగమంచు కమ్మినప్పటికీ తర్వాత ఎండ తీక్షణం మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండకాసింది. ఆతర్వాత నుంచి ఆకాశం మేఘావృతమై ముసురు వాతావరణం కొనసాగింది. అక్కడక్కడ భారీ, జల్లులతో కూడిన వర్షం కురిసింది. అలాగే వాతావరణంలోని మార్పులు కొనసాగుతున్నా ఎండ ప్రభావం మాత్రం తగ్గడం లేదు.

అనంతగిరిలో 38.6 డిగ్రీలు

వాతావరణంలోని మార్పులు చోటుచేసుకుంటున్నప్పటికీ మన్యంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. శనివారం అనంతగిరిలో 38.6 డిగ్రీల సెల్సియస్‌గా గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా కొయ్యూరులో 38.5, అరకులోయలో 38.1, జి.మాడుగులలో 36.2, పెదబయలులో 35.3, హుకుంపేటలో 35.0, ముంచంగిపుట్టులో 34.6, చింతపల్లిలో 34.0 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

జి.మాడుగులలో..

మండలంలోని శనివారం మండలంలో పలుచోట్ల జోరు వాన కురిసింది. గడిచిన రెండు రోజలుగా వర్షం కురవడంతో వాతావరణం కాస్త చల్లబడింది. ఈ వర్షాలు రెండో పంట వరి సాగుకు, కొన్ని అంతర పంటలకు ఉపయోగకరమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

Updated Date - Apr 25 , 2026 | 11:01 PM