మందులను మోసుకొచ్చిన డ్రోన్
ABN , Publish Date - Mar 26 , 2026 | 12:40 AM
పాడేరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి తాజంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బుధవారం పలు రకాల అత్యవసర మందులను డ్రోన్ మోసుకొచ్చింది. అలాగే పీహెచ్‌సీ నుంచి డ్రోన్‌లో నోడ్ హెల్పర్ రోగుల రక్త నమూనాలను అక్కడికి పంపించారు. ఈ రక్త నమూనాల ఫలితాలను సైతం డ్రోన్ ద్వారా అధికారులు పీహెచ్‌సీకి చేరవేయనున్నారు.
- పాడేరు నుంచి తాజంగి పీహెచ్‌సీకి చేరవేత
- ఇక్కడ నుంచి రక్త నమూనాలు అక్కడికి..
చింతపల్లి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): పాడేరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి తాజంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బుధవారం పలు రకాల అత్యవసర మందులను డ్రోన్ మోసుకొచ్చింది. అలాగే పీహెచ్‌సీ నుంచి డ్రోన్‌లో నోడ్ హెల్పర్ రోగుల రక్త నమూనాలను అక్కడికి పంపించారు. ఈ రక్త నమూనాల ఫలితాలను సైతం డ్రోన్ ద్వారా అధికారులు పీహెచ్‌సీకి చేరవేయనున్నారు. డ్రోన్ ద్వారా తక్కువ సమయంలో దూర ప్రాంతాలకు వైద్య ఆరోగ్యశాఖ మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకురావడంపై ఆదివాసీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.