Share News

ఏసీబీకి చిక్కిన డీఆర్‌వో లోకేశ్వరరావు సస్పెన్షన్‌

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:12 AM

సొంత శాఖలోని ఉద్యోగి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్‌ లోకేశ్వరరావును సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏసీబీకి చిక్కిన డీఆర్‌వో లోకేశ్వరరావు సస్పెన్షన్‌
ఎంవీఎస్‌ లోకేశ్వరరావు

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

పాడేరు, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): సొంత శాఖలోని ఉద్యోగి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్‌ లోకేశ్వరరావును సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ అయిన ఎంవీఎస్‌ లోకేశ్వరరావు కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అదే శాఖలోని జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న చక్రవర్తి సర్వీసు వ్యవహారాన్ని చక్కదిద్దడంతో పాటు, ఆయనకు ఎరియర్స్‌గా రావాల్సిన రూ.17 లక్షలకు సంబంధించిన బిల్లులను పాస్‌ చేసేందుకు డీఆర్‌వో లోకేశ్వరరావు ఆ ఉద్యోగి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా గత నెల 23న ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో లోకేశ్వరరావును సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Oct 07 , 2026 | 12:12 AM