ముసాయిదా ఓటర్లు 11,93,053
ABN , Publish Date - Aug 01 , 2026 | 01:04 AM
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్నికల సంఘం శుక్రవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11,93,053 మంది ఓటర్లు వున్నారు.. వీరిలో పురుషలు 5,81,112 మంది, మహిళలు 6,11,914 మంది, ఇతరులు 27 మంది ఉన్నారు.
మహిళదే పైచేయి
పురుషులకన్నా 30,802 మంది అధికం
2,31,577 ఓటర్లతో ‘పేట టాప్
1,76,391 ఓటర్లతో అట్టడుగున మాడుగుల
నేటి నుంచి అభ్యంతరాలు, దరఖాస్తుల స్వీకరణ
‘సర్’కు ముందుతో పోలిస్తే 1,09,336 మంది ఓటర్లు తక్కువ
----
ముసాయిదా ఓటర్ల జాబితాల ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలు
------
నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం సర్‌కు ముందు
చోడవరం 97,593 1,02,796 8 2,00,397 2,19,895
మాడుగుల 86,073 90,316 2 1,76,391 1,90,545
అనకాపల్లి 94,871 1,01,937 5 1,96,813 2,15,615
ఎలమంచిలి 92,747 97,774 6 1,90,527 2,08,851
పాయకరావుపేట 1,14,052 1,17,523 2 2,31,577 2,53,393
నర్సీపట్నం 95,776 1,01568 4 1,97,348 2,14,090
మొత్తం 5,81,112 6,11,914 27 11,93,053 13,02,389
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్నికల సంఘం శుక్రవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11,93,053 మంది ఓటర్లు వున్నారు.. వీరిలో పురుషలు 5,81,112 మంది, మహిళలు 6,11,914 మంది, ఇతరులు 27 మంది ఉన్నారు. పురుషుల కంటే 30,802 మంది మహిళా ఓటర్లు అధికాంగా ఉండడం విశేషం. పాయకరావుపేట నియోజకవర్గం 1,97,348 మంది ఓటర్లతో మొదటి స్థానంలో, మాడుగుల నియోజకవర్గం 1,76,391 ఓటర్లతో చివరిస్థానంలో వున్నాయి. మిగిలిన చోడవరం నియోజకవర్గంలో 2,00,397 మంది ఓటర్లు, అనకాపల్లిలో 1,90,527 మంది, నర్సీపట్నంలో 1,97,348 మంది, ఎలమంచిలిలో 1,90,527 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పురుషులకన్నా మహిళలు అధికంగా వున్నారు. అత్యధికంగా పాయకరావుపేటలో 1,17,523 మంది, అత్యల్పంగా మాడుగులలో 90,316 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
నేటి నుంచి అభ్యంతరాల స్వీకరణ
ముసాయిదా ఓటరు జాబితాలపై ఆగస్టు ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఓటర్ల పేర్లు, చిరునామాలు, వయసు, పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వివరాలపై అభ్యంతరాలు, కొత్తగా ఓటు నమోదు, పేరు తొలగింపు, సవరణల కోసం దరఖాస్తులను స్వీకరిస్తారు. వీటిని పరిశీలించిన అనంతరం అక్టోబరు 3వ తేదీన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది.