స్పీకర్‌ను కలిసిన డోజ్కో ప్రతినిధులు
ABN , Publish Date - Nov 10 , 2026 | 01:29 AM
మాకవరపాలెం మండలంలో పరిశ్రమను ఏర్పాటు చేయనున్న డోజ్కో కంపెనీ ప్రతినిధులు ఆదివారం ఇక్కడ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుని మర్యాద పూర్వకంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
కొత్త ప్రాజెక్టుల వివరాలు వెల్లడి
స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని అయ్యన్నపాత్రుడు ఆశాభావం
నర్సీపట్నం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి):
మాకవరపాలెం మండలంలో పరిశ్రమను ఏర్పాటు చేయనున్న డోజ్కో కంపెనీ ప్రతినిధులు ఆదివారం ఇక్కడ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుని మర్యాద పూర్వకంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాకవరపాలెం మండలం రాచపల్లి ప్రాంతంలో రూ.1,256 కోట్ల పెట్టుబడితో ఎర్త్ మూవర్ యంత్రాలు, వాటి విడిభాగాల తయారీ యూనిట్ వివరాలను స్పీకర్‌కి తెలియజేశారు. ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయని, శరవేగంగా పూర్తిచేసి త్వరలో ఉత్పత్తిని ప్రారంభిస్తామని ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న కొత్త ప్రాజెక్ట్‌ల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందిస్తూ... మాకవరపాలెం మండలం పరిశ్రమల హబ్‌గా మారుతుండడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇటువంటి పరిశ్రమలు ఈ ప్రాంతానికి రావడం వల్ల స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని అన్నారు. స్పీకర్‌ని కలిసిన వారిలో డోజ్కో కంపెనీ ప్రతినిధులు ఆర్‌కే బంగూర్, ఎన్‌జీ బంగూర్, జనరల్ మేనేజర్ ఎం.చంద్రశేఖరరావు ఉన్నారు.