Share News

డబుల్‌ ధమాకా..!

ABN , Publish Date - Feb 02 , 2026 | 12:48 AM

సిరిపురం, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): గ్రూప్స్‌ ఫలితాల్లో అగనంపూడికి చెందిన బూసరి అభిషేక్‌ సత్తా చాటాడు. గ్రూప్‌-1లో డీఎస్పీగా, గ్రూప్‌-2లో డిప్యూటీ తహశీల్దార్‌ ఎంపికయ్యాడు.

డబుల్‌ ధమాకా..!

ఒకేసారి రెండు ఉద్యోగాలకు ఎంపికైన అభిషేక్‌

గ్రూప్‌-2లో డిప్యూటీ తహశీల్దార్‌, గ్రూప్‌-1లో డీఎస్పీ పోస్టులు

సిరిపురం, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి):

గ్రూప్స్‌ ఫలితాల్లో అగనంపూడికి చెందిన బూసరి అభిషేక్‌ సత్తా చాటాడు. గ్రూప్‌-1లో డీఎస్పీగా, గ్రూప్‌-2లో డిప్యూటీ తహశీల్దార్‌ ఎంపికయ్యాడు. విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడ గ్రామానికి చెందిన బూసరి జగన్నాథం, భవాని దంపతులు బతుకుతెరువుకోసం నగరంలోని అగనంపూడి వచ్చారు. జగన్నాథం స్టీల్‌ప్లాంటు కో-ఆపరేటివ్‌ సొసైటీలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. ఇతడికి ఇద్దరు కుమారులు. అభిషేక్‌ ఆశీల్‌మెట్టలోని ప్రైవేటు జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌, పంజాబ్‌లో ఇంజనీరింగ్‌ చేశాడు. ఆ తరువాత గ్రూప్స్‌కు సన్నద్ధమయ్యాడు. నిపుణుల సలహాలు తీసుకుంటూ ఇంటి వద్దే రెండేళ్లు శ్రమించాడు. తాజాగా విడుదలైన గ్రూప్‌-1లో డీఎస్పీ ఉద్యోగాన్ని సాధించిన అతడు, అంతకుముందు విడుదలైన గ్రూప్‌-2లో డిప్యూటీ తహశీల్దార్‌ పోస్టుకు ఎంపికయ్యాడు. సర్కారు కొలువుల్లో డబుల్‌ ధమాకా సాధించిన అభిషేక్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. తన కొడుకు సర్కారు కొలువు సాధిస్తాడనే నమ్మకం ఉందని, అయితే ఒకేసారి రెండు ఉద్యోగాలకు ఎంపికవడం, ఎంతో ఆనందంగా ఉందని తండ్రి జగన్నాథం ఉబ్బితబ్బిబ్బయ్యాడు. చిన్న కుమారుడు ఏయూలో బీ ఫార్మసీ చదువుతున్నాడని తెలిపారు.

Updated Date - Feb 02 , 2026 | 12:48 AM