Share News

పీజీఆర్‌ఎస్‌పై నిర్లక్ష్యం వద్దు

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:34 AM

మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంపై నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అధికారులకు కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ సూచించారు.

పీజీఆర్‌ఎస్‌పై నిర్లక్ష్యం వద్దు
వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

ఐవీఆర్‌ఎస్‌ సేవల్లో సంతృప్తి స్థాయిని పెంచాలని అధికారులకు సూచన

పాడేరు, మార్చి 18(ఆంధ్రజ్యోతి): మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంపై నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అధికారులకు కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ సూచించారు. ఉమ్మడి అల్లూరి జిల్లాలోని పీజీఆర్‌ఎస్‌, ఇతర అంశాలపై వివిధ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడారు. పీజీఆర్‌ఎస్‌లో వినతుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రతీ వినతిని పక్కాగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఎక్కువ వినతులు పెండింగ్‌లో లేకుండా త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని గడువులోగా పరిష్కరించాలన్నారు. ప్రజల స్పందనను తెలుకునేందుకు వస్తున్న ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌లో ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలని, ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ప్రాధ్యానతను ప్రజలకు వివరించాలని తెలిపారు. అలాగే క్షేత్ర స్థాయి పరిస్థితులను గమనిస్తూ అధికారులు ఉమ్మడి అల్లూరి జిల్లాలో అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షణలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అల్లూరి, పోలవరం జిల్లాలకు చెందిన జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2026 | 12:34 AM