గర్భిణికి తప్పని డోలీమోత
ABN , Publish Date - Apr 02 , 2026 | 12:11 AM
మండలంలోని ఆంధ్ర- ఒడిశా సరిహద్దు కొల్లాపుట్టు పంచాయతీ డోకిరిగుడ గ్రామానికి రహదారి సౌకర్యం లేక డోలీ మోతలు తప్పడం లేదు.
డోకిరిగుడ గ్రామానికి రహదారి సౌకర్యం లేక మూడు కిలోమీటర్లు మోసుకెళ్లాల్సిన దుస్థితి
డుంబ్రిగుడ, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆంధ్ర- ఒడిశా సరిహద్దు కొల్లాపుట్టు పంచాయతీ డోకిరిగుడ గ్రామానికి రహదారి సౌకర్యం లేక డోలీ మోతలు తప్పడం లేదు. ఆ గ్రామానికి చెందిన కిల్లో డొమిని అనే గ ర్భిణికి బుధవారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో కుటుంబ సభ్యులు డోలీ కట్టి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని బొడ్లమామిడి రోడ్డు జంక్షన్ వరకు మోసుకెళ్లారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు.