గర్భిణికి తప్పని డోలీమోత
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:38 AM
మండలంలోని పెద్దూరుగొంది గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో నిండు గర్భిణిని ఐదు కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
ఐదు కిలోమీటర్లు మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు
గూడెంకొత్తవీధి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెద్దూరుగొంది గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో నిండు గర్భిణిని ఐదు కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. మండలంలోని శివారు జర్రెల పంచాయతీ పెద్దూరుగొంది గ్రామానికి చెందిన పూజరి లక్ష్మికి నెలలు నిండడంతో మంగళవారం ఉదయం పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. గ్రామానికి రహదారి సదుపాయం లేకపోవడం వలన అంబులెన్సు వచ్చే పరిస్థితి లేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను కొండ్రుపల్లి వరకు ఐదు కిలోమీటర్లు డోలిపై మోసుకొచ్చారు. అక్కడ నుంచి అంబులెన్సులో జర్రెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గర్భిణి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.