Share News

స్వీయ గణన చేసుకోండి

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:10 PM

భారత జనగణన-2027లో భాగంగా ప్రతి ఒక్కరూ స్వీయ గణన చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ టి.నిశాంతి పిలుపునిచ్చారు.

స్వీయ గణన చేసుకోండి
5కే వాక్‌లో పాల్గొన్న కలెక్టర్‌ నిశాంతి, జేసీ శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, తదితరులు

జిల్లా కలెక్టర్‌ నిశాంతి

ఉత్సాహంగా 5కే వాక్‌

పాడేరు, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): భారత జనగణన-2027లో భాగంగా ప్రతి ఒక్కరూ స్వీయ గణన చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ టి.నిశాంతి పిలుపునిచ్చారు. స్వీయ గణనపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు శనివారం నిర్వహించిన 5కే వాక్‌లో ఆమె పాల్గొని మాట్లాడారు. జనగణనలో భాగమైన స్వీయ గణనపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. ఈనెల 16వ తేదీన మొదలైన ఆ ప్రక్రియ ఈనెల 30వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. స్వీయ గణన అనంతరం ఎన్యూమరేటర్లు తమ వద్దకు వచ్చి సమాచారాన్ని పోల్చి నిర్థారిస్తారన్నారు. డిజిటల్‌ రూపంలో సేకరిస్తున్న జనగణనతో పౌరుల డేటా అత్యంత భద్రంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా స్థానిక అంబేడ్కర్‌ కూడలి నుంచి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ వరకు అక్కడి నుంచి తిరిగి అంబేడ్కర్‌ కూడలి వరకు జరిగిన 5కే వాక్‌లో అధికారులు, ఉద్యోగులు, యువత, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. 5కే వాక్‌లో విజేతలైన ఐదుగురు వి.రాజు, వి.రిషి, వెంకట్‌, కె.ప్రణిత్‌, యోగిలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, డీఆర్‌వో ఎంవీఎస్‌.లోకేశ్వరరావు, ఎస్‌డీసీ నీలకంఠరావు, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌ చిట్టబ్బాయి, ఎన్‌ఎస్‌ఎస్‌ జిల్లా నోడల్‌ అధికారి జి.గౌరిశంకరరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2026 | 11:10 PM