Share News

అనుమతుల్లేని కళాశాలల్లో పిల్లలను చేర్చొద్దు

ABN , Publish Date - May 10 , 2026 | 12:39 AM

ఇంటర్మీడియట్‌ బోర్డు నుంచి అనుమతులు లేని కళాశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలు చేపడితే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యా శాఖ అధికారి (డీఐఈవో) మద్దిలి వినోద్‌బాబు ఒక ప్రకటనలో హెచ్చరించారు.

అనుమతుల్లేని కళాశాలల్లో పిల్లలను చేర్చొద్దు
మద్దిలి వినోద్‌బాబు, డీఐఈవో

డీఐఈవో వినోద్‌బాబు

నర్సీపట్నం, మే 9 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ బోర్డు నుంచి అనుమతులు లేని కళాశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలు చేపడితే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యా శాఖ అధికారి (డీఐఈవో) మద్దిలి వినోద్‌బాబు ఒక ప్రకటనలో హెచ్చరించారు. డిఫెన్స్‌ అకాడమీ, ఐఐటీ అకాడమీ, నీట్‌ అకాడమీ పేర్లతో కొంతమంది విద్యా సంస్థలు నిర్వహిస్తూ ఇంటర్‌ మొదటి సంవత్సరం అడ్మిషన్లు చేపడుతున్నట్టు తెలిసిందని, ఇటువంటి వాటిల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను చే ర్పించవద్దని ఆయన సూచించారు. ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు మంజూరు చేసిన కళాశాల కోడ్‌ ‘06’తో ప్రారంభమవుతుందని, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటర్‌ మొదటి సంవత్సరంలో చేర్పించే ముందు సంబంధిత కళాశాలకు అనుమతి వుందా? లేదా? అన్నది నిర్ధారించుకోవాలని చెప్పారు.

Updated Date - May 10 , 2026 | 12:39 AM