Share News

ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీల్లో దైవజ్ఞ ప్రతిభ

ABN , Publish Date - May 20 , 2026 | 12:02 AM

మలేషియా రాఽజధాని కౌలాలంపూర్‌లో మంగళవారం నిర్వహించిన ప్రపంచ యోగా చాంపియన్‌షిప్‌ పోటీల్లో స్థానిక పతంజలి యోగా కేంద్రం విద్యార్థిని ముత్యాల దైవజ్ఞ ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది.

ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీల్లో దైవజ్ఞ ప్రతిభ
రజత పతకం సాధించిన దైవజ్ఞ

యోగాలో రజత పతకం

చోడవరం, మే 19 (ఆంధ్రజ్యోతి): మలేషియా రాఽజధాని కౌలాలంపూర్‌లో మంగళవారం నిర్వహించిన ప్రపంచ యోగా చాంపియన్‌షిప్‌ పోటీల్లో స్థానిక పతంజలి యోగా కేంద్రం విద్యార్థిని ముత్యాల దైవజ్ఞ ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. ఈ నెల 16 నుంచి 19 వరకు కౌలాలంపూర్‌లో ప్రపంచ యోగా చాంపియన్‌షిన్‌ పోటీలు నిర్వహిస్తుండగా, మంగళవారం జరిగిన ఫైనల్‌ పోటీల్లో 6 నుంచి 10 ఏళ్ల విభాగంలో పాల్గొన్న దైవజ్ఞ కుక్కుటాసనం, టిట్టిబ ఆసనం, గండభేరుండ వంటి కష్టతరమైన ఆసనాలు ప్రదర్శించి రెండవ స్థానంలో నిలిచింది. ఆ బాలికను పతంజలి యోగా కేంద్రం వ్యవస్థాపకుడు పుల్లేటి సతీశ్‌, కేంద్రం చైర్మన్‌ పసుమర్తి అశోక్‌, డాక్టర్‌ బంగారుకృష్ణ, తదితరులు అభినందించారు.

Updated Date - May 20 , 2026 | 12:02 AM