రాష్ట్రస్థాయి బీచ్ కబడ్డీ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
ABN , Publish Date - May 05 , 2026 | 11:31 PM
రాష్ట్రస్థాయి బీచ్ కబడ్డీ పోటీలకు జిల్లా నుంచి పాల్గొనే జట్ల ఎంపిక పోటీలను మంగళవారం తుమ్మపాల క్రీడా మండలి మైదానంలో నిర్వహించారు.
తుమ్మపాల (అనకాపల్లి), మే 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి బీచ్ కబడ్డీ పోటీలకు జిల్లా నుంచి పాల్గొనే జట్ల ఎంపిక పోటీలను మంగళవారం తుమ్మపాల క్రీడా మండలి మైదానంలో నిర్వహించారు. మొత్తం 20 మంది ఈ పోటీలకు హాజరుకాగా ఉత్తమ ప్రతిభ చూపిన ఆరుగురు బాలురు, ఆరుగురు బాలికలను ఎంపిక చేశారు. ఈ నెల ఏడో తేదీ నుంచి నెల్లూరు జిల్లాలో జరిగే 13వ అంతర్ జిల్లాల సీనియర్ బీచ్ కబడ్డీ పోటీల్లో వీరు జిల్లా తరపున పాల్గొంటారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి దాడి శ్యాంప్రసాద్ అభినందించారు. ఎంపిక పోటీల్లో కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి, ప్రతినిధులు గాలి రాజు, వ్యాయామ ఉపాధ్యాయులు జయబాబు, క్రాంతి పాల్గొన్నారు.