‘సర్’పై టీడీపీ వర్కుషాపునకు జిల్లా నేతలు
ABN , Publish Date - Jun 03 , 2026 | 01:04 AM
ఓటర్లకు సంబంధించి త్వరలో చేపట్టనున్న ‘స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్ (సర్)’పై మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన వర్కుషాపునకు జిల్లా నుంచి పలువురు ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు, కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు.
ఎలమంచిలి, జూన్ 2 (ఆంధ్రజ్యోతి):
ఓటర్లకు సంబంధించి త్వరలో చేపట్టనున్న ‘స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్ (సర్)’పై మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన వర్కుషాపునకు జిల్లా నుంచి పలువురు ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు, కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పలు సూచనలు చేశారు. ‘సర్’ సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ‘సర్’పై శిక్షణతోపాటు ఓటరు జాబితాల రివిజన్‌పై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, గండి బాబ్జీ, ప్రగడ నాగేశ్వరరావు, మళ్ల సురేంద్ర, తదితరులు హాజరయ్యారు.