Share News

రాజ్యసభ అభ్యర్థి విజయ్‌కు జిల్లా నేతల అభినందనలు

ABN , Publish Date - Jun 09 , 2026 | 01:52 AM

అమరావతిలో సోమవారం రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన చింతకాయల విజయ్‌ను జిల్లాకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు.

రాజ్యసభ అభ్యర్థి విజయ్‌కు జిల్లా నేతల అభినందనలు

అనకాపల్లి, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి):

అమరావతిలో సోమవారం రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన చింతకాయల విజయ్‌ను జిల్లాకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయ్‌ తండ్రి, శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుతోపాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, ప్రధాన కార్యదర్శి లాలం కాశినాయుడు, కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, పీవీజీ కుమార్‌, తదితరులు విజయ్‌కు అభినందనలు తెలిపారు. ఉత్తరాంధ్రకు చెందిన బీసీ యువ నేత విజయ్‌ను రాజ్యసభకు ఎంపిక చేసిన సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాన్‌, టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jun 09 , 2026 | 01:52 AM