నేడు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర రాక
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:12 AM
జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు.
అనకాపల్లి/ కె.కోటపాడు, జనవరి 19 (ఆంధ్రజ్యోతి):
జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 7.30 గంటలకు గన్నవరం నుంచి విమానంలో బయలుదేరి 8.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి కె.కోటపాడు మండలం కింతాడ గ్రామానికి చేరుకుంటారు. పల్లెపండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా పంచాయతీ పరిధిలోని బొట్టవానిపాలెంలో రూ.20 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఇదే మండలంలో గొండుపాలెం నుంచి రొంగలినాయుడుపాలెం వరకు నాలుగు కిలోమీటర్ల మేర రూ.1.68 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుడతారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం అనకాపల్లి చేరుకొంటారు. విశాఖ ఉత్సవ్‌పై కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం అవుతారు. అనంతరం రోడ్డు మార్గంలో విశాఖకు బయలుదేరి వెళతారు.