Share News

నేడు జిల్లా కలెక్టర్‌ బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Apr 04 , 2026 | 11:18 PM

కొత్త కలెక్టర్‌ టి.నిశాంతి ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు.

నేడు జిల్లా కలెక్టర్‌ బాధ్యతల స్వీకరణ
టి.నిశాంతి

శనివారం రాత్రే పాడేరు చేరుకున్నకొత్త కలెక్టర్‌ టి.నిశాంతి

ఏపీఐఐసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించేందుకు అమరావతి వెళ్లిన దినేశ్‌కుమార్‌

పాడేరు, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): కొత్త కలెక్టర్‌ టి.నిశాంతి ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇన్నాళ్లు ఇక్కడ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఏఎస్‌.దినేశ్‌కుమార్‌కు ఏపీఐఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బదిలీ కాగా బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న టి.నిశాంతి పదోన్నతిపై జిల్లా కలెక్టర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. దీంతో జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌కు గురువారం వీడ్కోలు సత్కారం జరగడంతో ఆయన శనివారం ఇక్కడి నుంచి అమరావతికి బయలుదేరారు. సోమవారం ఆయన ఏపీఐఐసీ ఎండీగా బాధ్యతలు స్వీకరిస్తారు. కొత్త జిల్లా కలెక్టర్‌గా నియమించిన నిశాంతి శనివారం రాత్రి పాడేరు చేరుకున్నారు. ఆదివారం ఉదయం మోదకొండమ్మను దర్శించుకుని తర్వాత కలెక్టరేట్‌లో ఆమె జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని అధికారులు తెలిపారు.

Updated Date - Apr 04 , 2026 | 11:18 PM