Share News

రేపే సామాజిక పింఛన్ల పంపిణీ

ABN , Publish Date - Jul 29 , 2026 | 12:54 AM

జిల్లాలో సామాజిక పింఛన్లు ఈనెల 30వ తేదీ (గురువారం)నే పంపిణీ చేయనున్నారు.

రేపే సామాజిక పింఛన్ల పంపిణీ

విశాఖపట్నం, జూలై 28 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో సామాజిక పింఛన్లు ఈనెల 30వ తేదీ (గురువారం)నే పంపిణీ చేయనున్నారు. ఆగస్టు ఒకటో తేదీన భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ వస్తున్నారు. ఆ కార్యక్రమంలో అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొనున్నందున ఒకరోజు ముందుగానే జిల్లాలో పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. మొత్తం 1,57,092 మందికి రూ.69.48 కోట్లు బుధవారం సచివాలయ ఉద్యోగులకు అందజేస్తారు.

Updated Date - Jul 29 , 2026 | 12:54 AM