Share News

నేడు ఎన్నికల సామగ్రి పంపిణీ

ABN , Publish Date - Nov 04 , 2026 | 01:48 AM

జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేపట్టింది. జిల్లాలో 11 జడ్పీటీసీ, 172 ఎంపీటీ స్థానాలకు గురువారం ఎన్నికలను నిర్వహించేందుకు గాను మండలాల వారీగా అవసరమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి మండల కేంద్రంలో ఆయా మండలంలో పోలింగ్‌ కేంద్రాల ఆధారంగా అవసరమైన బ్యాలెట్‌ బాక్స్‌లు, బ్యాలెట్‌ పత్రాలు, ఇతర సామగ్రిని ఒక బ్యాగులో పెట్టి పంపిణీ కేంద్రాల్లో సిద్ధం చేశారు. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి ఆయా ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బందికి సామగ్రిని అందించి, వారిని ప్రత్యేక వాహనాల్లో ఆయా పోలింగ్‌ కేంద్రాలకు తరలిస్తారు. ఈ ప్రక్రియను ప్రతి మండల కేంద్రంలో ప్రణాళికాబద్ధంగా చేపట్టేలా మండల రిటర్నింగ్‌ అఽధికారులు చర్యలు చేపడుతున్నారు.

నేడు ఎన్నికల సామగ్రి పంపిణీ
అరకులోయలో మంగళవారం ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ నిషాంతి

- మండల కేంద్రాల్లో ఏర్పాట్లు

- 11 జడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ రేపు

పాడేరు, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేపట్టింది. జిల్లాలో 11 జడ్పీటీసీ, 172 ఎంపీటీ స్థానాలకు గురువారం ఎన్నికలను నిర్వహించేందుకు గాను మండలాల వారీగా అవసరమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి మండల కేంద్రంలో ఆయా మండలంలో పోలింగ్‌ కేంద్రాల ఆధారంగా అవసరమైన బ్యాలెట్‌ బాక్స్‌లు, బ్యాలెట్‌ పత్రాలు, ఇతర సామగ్రిని ఒక బ్యాగులో పెట్టి పంపిణీ కేంద్రాల్లో సిద్ధం చేశారు. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి ఆయా ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బందికి సామగ్రిని అందించి, వారిని ప్రత్యేక వాహనాల్లో ఆయా పోలింగ్‌ కేంద్రాలకు తరలిస్తారు. ఈ ప్రక్రియను ప్రతి మండల కేంద్రంలో ప్రణాళికాబద్ధంగా చేపట్టేలా మండల రిటర్నింగ్‌ అఽధికారులు చర్యలు చేపడుతున్నారు.

జిల్లాలోని స్థానిక సంస్థలకు సంబంధించిన ఓటర్లు, పోలింగ్‌ కేంద్రాల వివరాలు

- జిల్లాలోని మండలాలు: పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు

- జడ్పీటీసీ స్థానాలు: 11, అభ్యర్థులు 70 మంది

- ఎంపీటీసీ స్థానాలు: 172, అభ్యర్థులు 648 మంది

- మొత్తం పోలింగ్‌ కేంద్రాలు: 617

- అసెంబ్లీ నియోజకవర్గాలు: పాడేరు, అరకులోయ

- మొత్తం ఓటర్లు: 4,98,467

- ఎస్‌టీ ఓటర్లు: 4,69,033

- ఎస్‌సీ ఓటర్లు: 28,78

- బీసీ ఓటర్లు: 21,168

- ఇతర ఓటర్లు: 5,388

Updated Date - Nov 04 , 2026 | 01:48 AM