Share News

నేటి నుంచి బేబీ కిట్ల పంపిణీ

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:04 PM

మాతాశిశు సంరక్షణలో భాగంగా నవజాత శిశువుల కోసం బుధవారం నుంచి బేబీకిట్లను పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్‌ టి.నిషాంతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

నేటి నుంచి బేబీ కిట్ల పంపిణీ
బేబీ కిట్‌ నమూనా

కలెక్టర్‌ టి.నిషాంతి

పాడేరు, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): మాతాశిశు సంరక్షణలో భాగంగా నవజాత శిశువుల కోసం బుధవారం నుంచి బేబీకిట్లను పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్‌ టి.నిషాంతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్పత్రుల్లో జన్మించిన శిశువుల సంరక్షణలో భాగంగా గతంలో బేబీ కిట్లను అందించేవారు. వాటిలో సబ్బు, బాడీ లోషన్‌, తువ్వాలు, డ్రెస్‌, డైపర్‌, పిల్లో, పాలుపట్టే పిల్లర్‌, తదితర వస్తువులు ఉండేవి. అయితే గత కొన్నాళ్లుగా ఆస్పత్రుల్లో వాటి పంపిణీని నిలిపివేశారు. కాగా గిరిజన ప్రాంతంలో మాతాశిశు సంరక్షణలో భాగంగా వాటిని అందించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ టి.నిషాంతి నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం నుంచి స్థానిక జిల్లా ఆస్పత్రిలో జన్మించే శిశువులకు బేబీకిట్లను అందిస్తామని ఆమె పేర్కొన్నారు.

Updated Date - Sep 22 , 2026 | 11:04 PM