కోర్టు ఆదేశాలు బేఖాతరు
ABN , Publish Date - May 23 , 2026 | 12:23 AM
మండలంలోని దుప్పితూరులోగల భావనారుషి దేవస్థానానికి చెందిన భూమికి నష్టపరిహారం ఇవ్వకుండా ఏపీఐఐసీ అధికారులు ప్రహరీగోడ నిర్మిస్తుండడం వివాదాస్పదంగా మారింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి గోడ నిర్మిస్తున్నారని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మాడెం సూరి అప్పారావు ఆరోపించారు. వివరాల్లోకి వెళ్లే...
ఆలయ భూమికి పరిహారం ఇవ్వకుండానే ఏపీఐఐసీ ప్రహరీ గోడ నిర్మాణం
అచ్యుతాపురం, మే 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దుప్పితూరులోగల భావనారుషి దేవస్థానానికి చెందిన భూమికి నష్టపరిహారం ఇవ్వకుండా ఏపీఐఐసీ అధికారులు ప్రహరీగోడ నిర్మిస్తుండడం వివాదాస్పదంగా మారింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి గోడ నిర్మిస్తున్నారని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మాడెం సూరి అప్పారావు ఆరోపించారు. వివరాల్లోకి వెళ్లే...
దుప్పితూరు పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 275/1, 276/3లో 70 సెంట్ల భూమి భావనారుషి ఆలయం పేరున ఉంది. ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) భూసేకరణలో భాగంగా ఏపీఐఐసీ అధికారులు 2005లో ఈ భూమి కూడా సేకరించారు. కానీ పరిహారం చెల్లించలేదు. దీంతో అప్పటి నుంచి భూమిని ఆలయ అభివృద్ధి కమిటీ సాగుచేస్తూ వచ్చే ఆదాయాన్ని ఆలయంలో ధూప, దీప, నైవేద్యాలకు వినియోగిస్తున్నారు. ఆలయ భూమికి పరిహారం ఇప్పించాలని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మాడెం సూరి అప్పారావు అధికారులను కోరారు. కానీ పట్టించుకోలేదు. అయితే ఇటీవల అధికారులు ఈభూమి చుట్టూ కంచె వేయడం ప్రారంభించారు. ఆయన అభ్యంతరం చెప్పి పనులు ఆపలేదు.. దీంతో ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. కంచె వేసే పనులు ఆపాలంటూ కోర్డు ఈ నెల 21వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీఐఐసీ అధికారులకు ఈ విషయం తెలుసో లేదో కానీ శుక్రవారం ఏకంగా ప్రహరీ గోడ నిర్మాణం ప్రారంభించారు.