Share News

వార్డుల పునర్విభజన ముసాయిదా జాబితా ప్రదర్శన

ABN , Publish Date - Sep 06 , 2026 | 12:21 AM

పురపాలక సంఘం కార్యాలయంలో వార్డుల పునర్విభజన ముసాయిదా జాబితాను కమిషనర్‌ జంపా సరేంద్ర ఉద్యోగులతో కలిసి శనివారం ప్రదర్శించారు.

వార్డుల పునర్విభజన ముసాయిదా జాబితా ప్రదర్శన
వార్డుల పునర్విభజన ముసాయిదా జాబితా ప్రదర్శిస్తున్న కమిషనర్‌ జంపా సురేంద్ర, సిబ్బంది

నర్సీపట్నం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): పురపాలక సంఘం కార్యాలయంలో వార్డుల పునర్విభజన ముసాయిదా జాబితాను కమిషనర్‌ జంపా సరేంద్ర ఉద్యోగులతో కలిసి శనివారం ప్రదర్శించారు. ప్రస్తుతం ఉన్న 28 వార్డులను 40 వార్డులుగా చేసి వార్డుల విభజన, సరిహద్దులు ఫారం-1 లో ప్రచురించామన్నారు. ముసాయిదా జాబితాను స్వర్ణ వార్డులు, తహశీల్దార్‌, సబ్‌ కలెక్టర్‌ కార్యాలయాల్లో ప్రదర్శించామని కమిషనర్‌ తె లిపారు. వార్డుల పునర్విభజన ముసాయిదా మీద ఏమైనా ఫిర్యాదులు, సూచనలు, అభ్యంతరాలు ఉంటే ఏడు రోజుల్లోగా అందజేయాలని ప్రజలను కోరారు. సకాలంలో అందని ఫిర్యాదులు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరించడం వీలుపడదని తెలిపారు.

Updated Date - Sep 06 , 2026 | 12:21 AM