Share News

ఆస్తి పన్ను చెల్లింపుపై నేటి వరకే రాయితీ

ABN , Publish Date - Apr 30 , 2026 | 01:38 AM

జీవీఎంసీ పరిధిలోని ఆస్తి పన్ను చెల్లింపుదారులకు బకాయిలపై వడ్డీ మాఫీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుపై రాయితీ పొందడానికి గురువారం ఆఖరు రోజని కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ తెలిపారు. జీవీఎంసీ పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను, కొళాయి చార్జీల కింద రూ.620 కోట్లు వసూలు చేశామన్నారు.

ఆస్తి పన్ను చెల్లింపుపై  నేటి వరకే రాయితీ

బకాయిదారులకు వడ్డీపై 50 శాతం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం

పన్నుపై ఐదు శాతం రిబేటు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ పరిధిలోని ఆస్తి పన్ను చెల్లింపుదారులకు బకాయిలపై వడ్డీ మాఫీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుపై రాయితీ పొందడానికి గురువారం ఆఖరు రోజని కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ తెలిపారు. జీవీఎంసీ పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను, కొళాయి చార్జీల కింద రూ.620 కోట్లు వసూలు చేశామన్నారు. ఇంకా వివిధ కారణాలతో ఆస్తి పన్ను చెల్లించనివారు ఆ మొత్తాన్ని ఒకేసారి చెల్లించేస్తే వడ్డీపై 50 శాతం మాఫీ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ఒకేసారి చెల్లించేవారికి ఐదు శాతం రాయితీ కల్పించిందన్నారు. ఏప్రిల్‌ 30వ తేదీలోగా చెల్లింపులు జరిపేవారికే ఈ అవకాశం కల్పించిందన్నారు. బకాయిదారులు, పన్ను చెల్లింపుదారులు గురువారం పన్ను చెల్లించి ప్రభుత్వం కల్పించిన రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Updated Date - Apr 30 , 2026 | 01:38 AM