పీజీఆర్‌ఎస్‌పై నిర్లక్ష్యం ప్రదర్శిస్తే క్రమశిక్షణ చర్యలు
ABN , Publish Date - May 16 , 2026 | 12:45 AM
పీజీఆర్‌ఎస్‌పై నిర్లక్ష్యం ప్రదర్శిస్తే క్రమశిక్షణ చర్యలు
15పిడిఆర్ 4
అధికారులకు కలెక్టర్ నిషాంతి హెచ్చరిక
ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌లో 93 వినతులు స్వీకరణ
పాడేరు, మే 15 (ఆంధ్రజ్యోతి):
పీజీఆర్‌ఎస్ పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి హెచ్చరించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (మీకోసం)లో ఆమెఅధికారులను ఉద్దేశించి మాట్లాడారు. పీజీఆర్‌ఎస్‌లో అన్ని శాఖల అధికారులు విధిగా పాల్గొవాలని, కార్యక్రమం ముగిసే వరకు అందుబాటులో ఉండాలన్నారు. అర్జీలను పక్కాగా పరిశీలించి, పరిష్కరించాలన్నారు. ఈ క్రమంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. మండల స్థాయిలో ప్రతి సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని విధిగా నిర్వహించాలని, గ్రామ స్థాయి సమస్యలపై ప్రజలు జిల్లా కేంద్రానికి రాకుండా అక్కడే అధికారులు పరిష్కరించాలన్నారు. పైస్థాయి నుంచి వచ్చే అర్జీలను గడువులోగా పరిష్కరించాలన్నారు. అలాగే పీజీఆర్‌ఎస్ సేవలపై ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజాభిప్రాయాలను ప్రభుత్వం సేకరిస్తున్నదని, దానిపై అధికారులు బాధ్యతగా ఉండాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ టి.నిషాంతి, జేసీ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డీఆర్‌వో లోకేశ్వరరావు గిరిజనుల నుంచి 93 వినతులను స్వీకరించారు.
1100 కాల్ సెంటర్‌ను వినియోగించుకోవాలి
మీకోసం కార్యక్రమంలో సమర్పించిన అర్జీలపై తాజా స్థితిగతులను తెలుసుకునే ందుకు 1100 నంబర్ కాల్ సెంటర్‌ను వినియోగించుకోవాలని కలెక్టర్ టి.నిషాంతి సూచించారు. అర్జీదారులు కాల్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, డ్వామా పీడీ విద్యాసాగరరావు, డీఈవో రామకృష్ణారావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమిళ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, హౌసింగ్ పీడీ బి.బాబు, డీపీవో చంద్రశేఖర్, డీఎల్‌పీవో పీఎస్.కుమార్, పీఆర్ ఈఈ టి.కొండయ్యపడాల్ , ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ వీబీ.నాగేశ్వరరావు, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, సీపీవో ప్రసాద్, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ డీటీ వి.ధర్మరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.