Share News

ఆర్‌అండ్‌బీ ఏఈపై క్రమశిక్షణ చర్యలు?

ABN , Publish Date - Feb 11 , 2026 | 12:40 AM

స్థానిక ఆర్‌అండ్‌బీ ఏఈ సత్యప్రసాద్‌పై ఆ శాఖ ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు చేపట్టినట్టు సమాచారం. గత నెల 29వ తేదీన స్థానిక జిల్లా కోర్టు సముదాయంలో కక్షిదారుల కోసం నిర్మిస్తున్న టాయిలెట్ల నిర్మాణ పనులను, 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి ఎం.హరినారాయణ, బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు.

ఆర్‌అండ్‌బీ ఏఈపై క్రమశిక్షణ చర్యలు?

తమ మాట వినడంలేదని జిల్లా జడ్జికి చెప్పిన ఎస్‌ఈ, ఈఈలు

ఏఈకి షోకాజ్‌ నోటీసులు

బాధ్యతల నుంచి తొలగింపు

మాడుగుల ఏఈకి చోడవరం బాధ్యతలు

చోడవరం, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఆర్‌అండ్‌బీ ఏఈ సత్యప్రసాద్‌పై ఆ శాఖ ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు చేపట్టినట్టు సమాచారం. గత నెల 29వ తేదీన స్థానిక జిల్లా కోర్టు సముదాయంలో కక్షిదారుల కోసం నిర్మిస్తున్న టాయిలెట్ల నిర్మాణ పనులను, 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి ఎం.హరినారాయణ, బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ, ఈఈలు మాట్లాడుతూ, ఏఈ సత్యప్రసాద్‌ తమ మాట వినడం లేదని జడ్జి దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో వార్త ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా స్థానిక ఏఈకి నోటీసు ఇచ్చి, శాఖాపరమైన విచారణ చేపట్టినట్టు తెలిసింది. మాడుగుల ఏఈ సత్య శ్రీనివాస్‌కు చోడవరం బాధ్యతలు కూడా అప్పగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - Feb 11 , 2026 | 12:40 AM