టీడీపీ మహానాడులో డిజిటల్ హాజరు
ABN , Publish Date - May 28 , 2026 | 11:12 PM
గతానికి భిన్నంగా ఈసారి హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి వచ్చిన వారి హాజరు సైతం డిజిటల్‌లోనే నమోదు చేయడం విశేషం.
ఐటీడీపీ ఆధ్వర్యంలో నమోదు
పాడేరు, మే 28(ఆంధ్రజ్యోతి): గతానికి భిన్నంగా ఈసారి హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి వచ్చిన వారి హాజరు సైతం డిజిటల్‌లోనే నమోదు చేయడం విశేషం. వాస్తవానికి పార్టీ సమావేశాలు, ఇతర కార్యక్రమాలకు హాజరయ్యే నేతలు, కార్యకర్తలు, అభిమానులకు సంబంధించిన హాజరును మినిట్స్ బుక్‌లో నమోదు చేస్తారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ నేతలు, కార్యకర్తలకు అందించే గుర్తింపు కార్డుల ఆధారంగా అందులో ఉన్న బార్ కోడ్ ద్వారా మహానాడులో పాల్గొన్న వారిందరి హాజరును డిజిటల్ రూపంలో నమోదు చేశారు. ఐటీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్ద జ్యోతికిరణ్ ఆధ్వర్యంలో మహానాడులో డిజిటల్ హాజరు నమోదు ప్రక్రియను నిర్వహించారు. గతానికి భిన్నంగా డిజిటల్ విధానంలో పార్టీ కార్యక్రమంలో హాజరునమోదు చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.