మన్యంలో భిన్న వాతావరణం
ABN , Publish Date - Apr 23 , 2026 | 10:48 PM
మన్యంలో గురువారం భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ అధికంగా ఉండగా, ఆ తరువాత ముసురు వాతావరణం నెలకొంది.
ఉదయం ఎండ, మధ్యాహ్నం ముసురు
పాడేరు, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): మన్యంలో గురువారం భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ అధికంగా ఉండగా, ఆ తరువాత ముసురు వాతావరణం నెలకొంది. చింతపల్లిలో మధ్యాహ్నం రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. కాగా కొయ్యూరులో 38.7, అరకులోయ, జి.మాడుగులలో 37.4, అనంతగిరిలో 36.5, చింతపల్లిలో 36.0, పెదబయలులో 33.9, హుకుంపేటలో 33.6, ముంచంగిపుట్టులో 32.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చింతపల్లిలో..
చింతపల్లి: మండలంలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంది. రెండు గంటలకు ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. ఆకాశం మేఘావృతమై నాలుగు గంటల వరకు కుండపోత వర్షం కురిసింది. వర్షానికి ప్రధాన రహదారులన్నీ వాగులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది.