మన్యంలో భిన్న వాతావరణం
ABN , Publish Date - Mar 25 , 2026 | 12:29 AM
మన్యంలో మంగళవారం భిన్న వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది.
ఉదయం పొగమంచు, మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వాన
పాడేరు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): మన్యంలో మంగళవారం భిన్న వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది. ఆ తరువాత నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు ఎండకాసింది. అనంతరం ఆకాశం మేఘావృతమై ముసురు వాతావరణం కొనసాగింది. సాయంత్రం ఆరు గంటల తరువాత పాడేరులో ఒక మోస్తరు వర్షం కురిసింది. మంగళవారం అరకులోయలో 15.6, ముంచంగిపుట్టులో 16.5, డుంబ్రిగుడలో 17.2, పెదబయలులో 18.2, చింతపల్లిలో 18.3, జి.మాడుగులలో 19.3, కొయ్యూరులో 19.9 అనంతగిరిలో 20.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.