మన్యంలో భిన్న వాతావరణం
ABN , Publish Date - Mar 08 , 2026 | 11:31 PM
పాడేరులో ఆదివారం భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం 10 గంటల వరకు దట్టంగా పొగమంచు కురిసింది.
ఉదయం 10 గంటల వరకు దట్టంగా పొగమంచు
ఆ తరువాత ఎండ
సాయంత్రం 4 గంటల నుంచి చలి వాతావరణం
పాడేరు, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): పాడేరులో ఆదివారం భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం 10 గంటల వరకు దట్టంగా పొగమంచు కురిసింది. ఆ తరువాత నుంచి ఎండ ప్రతాపం చూపింది. సాయంత్రం 4 గంటల నుంచి చలి మొదలైంది. ఉదయం వేళల్లో వాహనచోదకులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సి వచ్చింది. రెండు రోజులుగా పొగమంచు పెద్దగా కురవలేదు. దీంతో మంచు ప్రభావం తగ్గుతున్నదని అందరూ భావిస్తుండగా ఆదివారం దట్టంగా కురిసింది.