మన్యంలో విభిన్న వాతావరణం
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:37 AM
మన్యంలో సోమవారం విభిన్నమైన వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్మేయగా, ఆ తరువాత ఒక మోస్తరుగా ఎండకాసింది.
ఉదయం దట్టంగా పొగమంచు
మధ్యాహ్నం భారీ వర్షం
పాడేరు, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): మన్యంలో సోమవారం విభిన్నమైన వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్మేయగా, ఆ తరువాత ఒక మోస్తరుగా ఎండకాసింది. మధ్యాహ్నం ఒంటి గంట తరువాత ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. దీంతో సోమవారం మధ్యాహ్నం నుంచి ఏజెన్సీ ప్రాంతంలో ముసురు వాతావరణం కొనసాగింది.
కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా..
అరకులోయ, ముంచంగిపుట్టులో సోమవారం 15.0, చింతపల్లిలో 15.6, పెదబయలులో 16.1, జి.మాడుగులలో 16.9, కొయ్యూరులో 18.1, అనంతగిరిలో 19.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.