చేపలవేటపై డీజిల్ పిడుగు
ABN , Publish Date - Mar 23 , 2026 | 01:16 AM
మత్స్య దిగుబడుల్లో కీలకపాత్ర పోషిస్తున్న విశాఖ హార్బర్‌లో చేపల వేట నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది.
భారీగా పెరిగిన ధరతో మత్స్యకారుల గగ్గోలు
వేట కొనసాగించడంపై మీమాంస
తీరంలో నిలిచిపోయిన మర పడవలు
బీచ్ రోడ్డు, మార్చి 21 (ఆంధ్రజ్యోతి):
మత్స్య దిగుబడుల్లో కీలకపాత్ర పోషిస్తున్న విశాఖ హార్బర్‌లో చేపల వేట నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది. మిడిల్ ఈస్ట్ సంక్షోభం ట్యూనా చేపల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇక్కడి నుంచి రోజుకు సుమారు 200 టన్నుల ట్యూనా చేపలను కేరళలో ప్రాసెస్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు. అయితే పశ్చిమాసియా దేశాలకు రవాణా అంతరాయం కలగడంతో ఎగుమతులు భారీగా పడిపోయాయి. తగ్గాయి. ఇక్కడి చేపల రేవులో 680 బోట్లు ఉండగా సుమారు 200పైగా బోట్లు ట్యూనా చేపల వేట సాగిస్తున్నాయి.
మత్స్య పరిశ్రమకు ఇంధన సెగ
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం మత్స్యపరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పరిశ్రమలకు సరఫరా చేసే డీజిల్ ధరలను కేంద్రం భారీగా పెంచడంతో బోటు ఆపరేటర్లు గగ్గోలు పెడుతున్నారు. ధరల పెంపు నుంచి తమను మినహియించాలని కోరుతున్నారు. పర్రిశమలకు సరఫరా చేసే డీజిల్ ధరను లీటర్‌కు రూ. 22 మేర చమురు సంస్థలు పెంచాయి. పన్నులతో కలిపి లీటరు రూ.123.70కు చేరింది. ప్రస్తుత చేపల రేవులో బోటు ఆపరేటర్లకు లీటర్‌కు రూ.9 చొప్పున క్రేందం రాయితీ ఇస్తోంది. రాయితీ పోను లీటరు రూ.87.22లకు లభిస్తోంది. ఇప్పుడు 23.70లు పెరగడంతో ధర రూ.110.92లకు చేరింది. తప్పనిసరి పరిస్థితిలో ఇదే ధరకు పలువురు ఆపరేటర్లు ఆదివారం డీజిల్ కొనుగోలు చేసి బోట్లను చేపలు వేటకు పంపారు. కాగా అఽధిక శాతం బోట్లు తీరంలోనే నిలిచిపోయాయి. ఎండలు ముదురుతుండడంతో చేపల వేట సవ్యంగా సాగడం లేదని, దిగుబడులు తగ్గాయని, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరలపై మినహాయింపు ఇచ్చేలా చూడాలని ఇప్పటికే మత్స్యశాఖ కమిషనర్‌కు లేఖ రాశామని జిల్లా జాయింట్ డైరెక్టర్ పి.లక్ష్మణరావు తెలిపారు.
శతాబ్ది ఉత్సవాలకు నిధుల సమీకరణ!
ఆ దిశగా ఏయూ అధికారుల చర్యలు
పూర్వ విద్యార్థులతో సమావేశాల నిర్వహణ
విశాఖపట్నం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో వర్సిటీ అధికారులు నిధుల సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఏడాదిగా వేడు క లను నిర్వహిస్తున్నారు. వచ్చే నెల నుంచి మరింత ఉత్సా హంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వందేళ్ల వేడుకల్లో పూర్వ విద్యార్థులందరినీ భాగస్వాములను చేయాలని నిర్ణ యించారు. ముఖ్యంగా వర్సిటీ పూర్వవిద్యార్థుల నుంచి నిధులు సమీకరించి అభివృద్ధి పనులు చేపట్టాలని యోచిస్తున్నారు. నిధులు అందించే వారందరికీ అభినందన సర్టిఫికెట్ అందించేందుకు సిద్ధమవుతున్నారు. పరిధి దాటి నిధులిచ్చే వారి పేర్లతో వర్సిటీలోని విభాగాలకు, గదులకు పేర్లు పెట్టాలని అధికారులు నిర్ణయించారు. అంతేకాకుండా నిధులందించే వారి వివరాలను ఆయా విభాగాల్లో ప్రదర్శించాలని నిర్ణయించారు.
ఏ రూపంలోనైనా..
శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో వర్సిటీకి ఏ రూపంలో నైనా సాయం అందించవచ్చని చెబుతున్నారు. ఆర్థిక సాయం, విభాగాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, గోల్డ్‌మెడల్స్ అందించేందుకు, ఎండోమెంట్ లెక్చర్స్ నిర్వహణకు నిధులు అందించవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు వర్సిటీ అభివృద్ధికి ఎంతోమంది ముందుకు వచ్చారు. వీరిలో కెమిస్ర్టీ విభాగం పూర్వ విద్యార్థి దేవ పురాణం రూ.70 లక్షలు అందించారు. 1977 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు సెమీ కండక్టర్ ల్యాబ్ ఏర్పాటుకు రూ.25 కోట్లు ఇచ్చారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన మరో పూర్వ విద్యార్థి పోస్టు డాక్టోరల్ ఫెలోషిప్ కోసం రూ.36 లక్షలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇప్పటికే వర్సిటీలో దేశ, విదేశాల్లో ఉన్నత స్థానా ల్లో ఉన్న పూర్వ విద్యార్థులతో సమావేశాలు నిర్వహించా మని, భవిష్యత్తులోనూ కొనసాగించి, భారీగా నిధులు సమీకరిస్తామని తెలిపారు.
పదిశాతమే వాణిజ్య సిలిండర్లు
విశాఖపట్నం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): నగరంలో వ్యాపారులకు వాణిజ్య సిలిండర్ల పంపిణీ పదిశాతమే కొనసాగుతోంది. ఆదివారం నుంచి 20 శాతం సిలిండర్లు పంపిణీచేస్తామని కేంద్రం ప్రకటించినా ఆదేశాలు అందలేదు. దీనిపై వ్యాపారులు గ్యాస్ ఏజెన్సీలను సంప్రదించినా ఫలితం లేకపోయింది. ఆదేశాలు వచ్చే వరకు డిమాండ్‌లో పది శాతం సిలిండర్లు మాత్రమే ఇస్తామని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. డొమెస్టిక్, వాణిజ్య సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు లేకుండా అధికారులు బాట్లింగ్ యూనిట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ గోవిందు హెచ్‌పీసీఎల్ బాట్లింగ్ యూనిట్‌లో సమీక్ష నిర్వహించారు.