Share News

ఘనంగా ముగిసిన ధారాలమ్మ జాతర

ABN , Publish Date - Mar 19 , 2026 | 11:02 PM

జీకేవీధి మండలం ధారకొండ ఘాట్‌రోడ్డులో కొలువైన ధారాలమ్మ అమ్మవారి జాతర గురువారంతో ఘనంగా ముగిసింది. జాతర మహోత్సవాలు మూడు రోజులుగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఘనంగా ముగిసిన ధారాలమ్మ జాతర
ధారాలమ్మ అమ్మవారిని గజమాలతో అలంకరించిన దృశ్యం

సీలేరు, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం ధారకొండ ఘాట్‌రోడ్డులో కొలువైన ధారాలమ్మ అమ్మవారి జాతర గురువారంతో ఘనంగా ముగిసింది. జాతర మహోత్సవాలు మూడు రోజులుగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జాతర ఆఖరి రోజైన గురువారంతో పాటు ఉగాది పర్వదినం కావడంతో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం కొత్తఅమావాస్య సందర్భంగా అమ్మవారికి సాయంత్రం మహా నివేదన సమర్పించి ఆలయ తలుపులు మూసి వేసిన ఉత్సవ కమిటీ ప్రతినిధులు గురువారం యథావిధిగా తెరిచారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో సాంబశివరావు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు అన్ని చర్యలు తీసుకున్నారు.

Updated Date - Mar 19 , 2026 | 11:02 PM